తెలంగాణ బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. వాయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ప్రియాంక గాంధీకి శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్చం అందించి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ, కుల గణన సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారని పొన్నం వెల్లడించారు.