TG : బీసీలు, మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం..పొన్నం ప్రభాకర్ ప్రకటన

Update: 2025-01-03 09:45 GMT

తెలంగాణలో తమ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో సావిత్రి భాయ్ పులే 194 వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. సావిత్రి భాయ్ పులే మహిళావిద్య కోసం పాటుపడారని కొనియాడారు. సావిత్రి భాయ్‌ పూలే జయంతిని తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిందన్నారు. సావిత్రి భాయ్ పులే స్ఫూర్తితో మహిళలు అన్ని రంగాల్లో వృద్ధి చెందాలన్నారు . 

Tags:    

Similar News