భారీ వానల కారణంగా ములుగు జిల్లాలో ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రి సీతక్కకు చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం ఏటూరు నాగారం మండలం ఓడగూడెంలో పర్యటించిన ఆమెను గ్రామస్తులు నిలదీశారు. భారీ వానలు పడినప్పుడు గ్రామంలోకి భారీగా నీళ్లు చేరి ఇండ్లు మునుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఏం చేయలేదని.. ఇప్పుడు మీరూ ఏం చేయట్లేదని గ్రామస్థులు సీతక్కను నిలదీశారు. వానలు పడినప్పుడు తమ ప్రాంతం నీట మునిగి నరకం చూస్తున్నామన్నారు. అయితే, వర్షాలు పడినప్పుడు మేమొస్తాం.. మీరు అడుగుతారని.. ఎండాకాలంలో మీరు పడుకుంటారు.. మేము పడుకుంటామంటూ సీతక్క గ్రామస్తులకు సమాధానం ఇచ్చారు.