హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలను స్వల్ప భూకంపం వణికించింది. బోరబండ, వెంకటగిరి, గాయత్రినగర్, పెద్దమ్మ నగర్ పరిసర ప్రాంతాల్లో రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో స్వల్ప భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ఒక్కసారిగా పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చి వీధుల్లోకి చేరుకున్నారు. ఏడెనిమిది సార్లు ఇలాంటి ప్రకంపనలు వచ్చాయని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నారు. అయితే ఈ భూ ప్రకంపనల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లకపోవడంతో... ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.