MLA Anirudh Reddy : డిన్నర్ మీటింగ్ పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హాట్ కామెంట్స్
కాంగ్రెస్ పార్టీ డిన్నర్ మీటింగ్‌పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా గీత దాటలేదని చెప్పారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలం ఒకచోట కలిసి తమ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలపైన మాత్రమే చర్చించామన్నారు. అంతకుమించి మరేమీలేదని స్పష్టం చేశారు. తన పోరాటం మొత్తం పేదవారి కోసమేనన్న అనిరుధ్ రెడ్డి.. ఈ పోరాటంలో తనను చంపుతారా లేక పేదవారికి న్యాయం చేస్తారా అని ఆవేదనను వ్యక్తం చేశారు.