MLA Dana Nagender : ఫుట్ పాత్ నిర్మాణాల కూల్చివేతలపై ఎమ్మెల్యే దానం ఫైర్
ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రభుత్వ అధికారుల తీరుపై సీరియస్ అయ్యారు. ప్రెస్ మీట్ లో ప్రభుత్వ విధానాలను తప్పుపట్టారు. బ్యూరోక్రాట్లు ఇష్టారీతిగా వ్యవహరిస్తే ప్రజాప్రతినిధులే స్పందించి ప్రజాగ్రహం రాకుండా చూడాలని ప్రభుత్వానికి హితవు పలికారు. ఫుట్‌పాత్ కూల్చివేతలు మొదలు పెట్టాలంటే పాతబస్తీ నుంచి మొదలు పెట్టాలన్నారు. అధికారులకు స్వేచ్ఛఇస్తే ఆ ప్రభుత్వాల మనుగడ ఉండదన్నారు. అధికారులు ఒక చోట పనిచేస్తూ బదిలీలతో మరోచోటకి వెళ్తారని.. కానీ ప్రజలు ఏ ఇబ్బంది వచ్చినా స్థానిక ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తారన్నారు. తనకు రాజకీయం ఇచ్చింది హైదరాబాదేనని కాబట్టి తాను ఖైరతాబాద్ నియోజకవర్గానికే పరిమితం కాదని, హైదరాబాద్‌లో ఎక్కడ ప్రజలకు ఇబ్బంది వచ్చినా దానం ముందుంటాడన్నారు.