Raja Singh : తప్పతాగి నిమజ్జనంలోకి రావద్దు.. రాజాసింగ్ హెచ్చరిక

Update: 2024-09-12 16:15 GMT

ట్రక్‌లపై మద్యం తాగుతూ గణేష్ నిమజ్జనానికి వెళ్తే.. వాళ్లపైన చర్యలు తీసుకోవాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరాబాద్ సీపీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాశారు.

గత ఏడాది నిమజ్జనం సమయంలో కొన్ని ఘటనలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. కొంత మంది బుద్దిలేని వాళ్ళు గణేష్ విగ్రహం వద్ద బీర్, మద్యం తాగుతూ.. టస్కర్లపై కూర్చుని నిమజ్జనానికి వస్తున్నారని తెలిపారు. దీంతో కొన్ని కొట్లాటలు జరుగుతున్నాయన్నారు. మద్యం సేవించి గణేష్ మహారాజ్‌ను తీసుకోని వెళ్లడం, వాటర్ ప్యాకెట్లు విసిరివేయడం లాంటి వారు కనిపిస్తే.. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలని, మన సంస్కృతి, పండుగలు కాపాడుకోవాలని గణేష్ భక్తులకు పిలుపునిచ్చారు.

మరోవైపు కొంత మంది ట్రక్‌లపై కూర్చొని వినాయక నిమజ్జనం చూడటానికి వచ్చిన వారిపై, ముఖ్యంగా మహిళపై వాటర్ ప్యాకెట్లు విసిరేస్తున్నారన్నారు రాజాసింగ్. ఇలాంటి ఘటనలు చాలా తమ దృష్టికి వచ్చాయన్నారు. ఎవరైనా ఇలాంటి పనులు చేసే వారు కనబడితే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని నగర సీపీని కోరారు. గణేష్ నిమజ్జనం హిందువులకు పెద్ద పండుగ అని తెలిపారు.

Tags:    

Similar News