TG : ఉద్యోగాల భర్తీపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కీలక వ్యాఖ్యలు

Update: 2024-12-19 13:00 GMT

రాష్ట్రంలో ఉన్న సమస్యలను కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పరిష్కరిస్తుందన్నారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. ఏడాదిలో 55 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని గుర్తు చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించి, అవినీతి లేకుండా 55వేల 143 ఉద్యోగాలు వేగంగా భర్తీ చేసినందుకు ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ఆయన పాల్గొన్నారు. జబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ విషయంతో తాను కూడా కృషి చేస్తున్నానని చెప్పారు మల్లన్న. నోటిఫికేషన్లు తామ వేశామని.. క్రెడిట్ కూడా తమకే ఇవ్వాలని బీఆర్ఎస్ అంటుందని.. లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని విమర్శించారు. తాను కేసులకు బయపడలేదని.. కేసీఆర్ కు అస్సలు భయపడలేదని చెప్పారు మల్లన్న.

Tags:    

Similar News