దేశవ్యాప్తంగా సేవా పక్వాడ పేరిట బీజేపీ కార్యక్రమాలు చేపడుతుందని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. రాజకీయాలు కేవలం అధికారం కోసమే కాదని... బీజేపీ దృష్టిలో రాజకీయాలు అంటే ప్రజాసేవా అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ప్రదర్శనను ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్సీ మల్క కోమురయ్య, బీజేపీ నేత వీరేంద్రగౌడ్ తదితరులు సందర్శించి తిలకించారు. లక్షలాది మందికి మోదీ జీవితం ఆదర్శం కావాలని ఎంపీ అన్నారు. ఎగ్జిబిషన్ ద్వారా మోదీ జీవిత చరిత్ర స్ఫూర్తిని అందరూ తెలుసుకోవాలని సూచించారు. కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.