:డబ్బులతో రాజకీయాలు ఎల్లకాలం నడపలేమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఎమ్మెల్యే కావాలంటే ఇంత, ఎంపీ కావాలంటే ఇంత ఖర్చు చేయాలంట కదా అంటున్నా రని, ఈ విషయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం జెండాకి ఎక్కిందని పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలంలో శనివారం నిర్వహించిన సంస్థాగత ఎన్నికల కార్యశాల మీటింగ్లో ఆయన మాట్లాడుతూ.. రేపు జరగబోయే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ డబ్బు ఖర్చు పెడతారన్న చర్చ జరుగుతోందన్నారు. ఇలాంటి కల్చర్, రుగ్మతలను పోగొట్టగలిగే శక్తి, సత్తా మీరు చేసే సభ్యత్వాలు, వేయబోయే కమిటీల మీదనే ఆధార పడి ఉంటుందని ఈటల పేర్కొన్నారు.