సూర్యాపేట జిల్లా కోదాడలో మానవత్వం మంటగలిసింది. అప్పుడే పుట్టిన ఇద్దరు ఆడ శిశువులను ఆస్పత్రిలోనే వదిలేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల క్రితం గణపవరం గ్రామానికి చెందిన ఆరోగ్య అనే మహిళ.. ఆడ కవల పిల్లలలకు జన్మనించింది. అయితే శిశువులు అనారోగ్యంగా ఉండటంతో.. ఆస్పత్రిలో వదలిసి వెళ్లిపోయింది. దీనిపై ఆస్పత్రి సిబ్బంది... పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు ఫిర్యాదు చేశారు. వెంటనే తల్లిదండ్రులను పిలిపించిన పోలీసులు... కౌన్సిలింగ్ ఇచ్చారు.