హుజురాబాద్‌లో బీజేపీ గెలుపుతో కేసీఆర్ ప్రభుత్వం పతనం : ఎంపీ అరవింద్
Mp Arvind : హుజురాబాద్‌లో బీజేపీ గెలుపుతో కేసీఆర్ ప్రభుత్వం పతనం ప్రారంభమైందని ఎంపీ అరవింద్ అన్నారు.;
Mp Arvind : హుజురాబాద్‌లో బీజేపీ గెలుపుతో కేసీఆర్ ప్రభుత్వం పతనం ప్రారంభమైందని ఎంపీ అరవింద్ అన్నారు. అవినీతి సొమ్ముతో గెలవాలని కుట్రలు చేసిన టీఆర్ఎస్‌కు హుజురాబాద్ ప్రజలు తిప్పికొట్టారని చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోను గెలిచి బీజేపీ అధికారం చేపడుతుందని అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. అటు హుజురాబాద్‌లో బీజేపీ అభ్యర్ధి ఈటెల రాజేందర్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. దీనితో ఆ పార్టీ శ్రేణులు పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు చేసుకుంటున్నారు.