TG : అధికారులపై దాడి బీ ఆర్ఎస్ ప్లానే : ఎంపీ మల్లు రవి

Update: 2024-11-12 12:45 GMT

ప్రజా ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేయాలని పథకం ప్రకారం బీఆర్‌ఎస్ కుట్రలు చేస్తోందని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కొడంగల్‌లో భూసేకరణపై వికారాబాద్ కలెక్టర్ గ్రామస్తులతో సమావేశం అయ్యేందుకు వెళ్లారని, బీఆర్‌ఎస్ నేతల ఆదేశాలతో రైతుల ముసుగులో కలెక్టర్‌పై దాడి చేశారని.. దీనిపై అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రాకపోవడంతో ఇలాంటి పనులు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని చూపించాలనే డ్రామాలో భాగంగానే కొడంగల్ ఘటన చేశారని ఆరోపించారు. ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేకు నిమిషానిమిషానికి ఫోన్లు చేసి, మందు సేవించి కలెక్టర్‌పై దాడి చేశారన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై జరిగిన దాడి కాదని.. ప్రజాస్వామ్య పాలనపై జరిగిన దాడి అని తెలిపారు. చేయించి, కేటీఆర్ ఢిల్లీకి వచ్చి బీజేపీ పెద్దలతో అంతకుముందే ఉన్న చీకటి ఒప్పందంలో భాగంగా గతంలో బీజేపీ సహకరించిన విషయాలను గుర్తుచేసి అమృత్ భారత్ స్కాం అంటూ ఫిర్యాదు చేయడానికి వచ్చారని ఎంపీ మల్లు రవి అన్నారు. బీజేపీ నేతలను రెచ్చగొట్టి.. రేవంత్ రెడ్డిపై బురదజల్లే ప్రయత్నం చేశారని తెలిపారు. ఏ ప్రాజెక్టు పనులైన టెండర్లు పిలిచే పనులు అప్పగిస్తారని.. ఆధారాలుంటే సీబీఐకి ఇవ్వాలన్నారు. రేవంత్ రెడ్డి సొంత బావమరిది అంటూ కేటీఆర్ ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.

Tags:    

Similar News