దళితులకు గతంలో కాంగ్రెస్ ఇచ్చిన భూములను కేసీఆర్ గుంజుకున్నారు : రేవంత్
కాంగ్రెస్ చేపట్టిన దళిత, గిరిజన దండోరా యాత్ర విజయవంతమైందన్నారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.;
కాంగ్రెస్ చేపట్టిన దళిత, గిరిజన దండోరా యాత్ర విజయవంతమైందన్నారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మీడియాతో ఆయన మాట్లాడుతూ... గతంలో దళితులకు కాంగ్రెస్ ఇచ్చిన భూములను కేసీఆర్ గుంజుకున్నారని, ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నదని చెప్పారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్నారని తమ యాత్రలో స్పష్టమైందని, ఇకే కేసీఆర్ శేష జీవతం ఫాంహౌస్ లోనేనని జోస్యం చెప్పారు. ఆగస్టు 9న ఇంద్రవెల్లి నుంచి సెప్టెంబర్ 17 గజ్వేల్ సభ వరకు చేపట్టిన దళిత,గిరిజన దండోరా యాత్ర లో కాంగ్రెస్ శ్రేణులు పోరాట స్ఫూర్తిని ప్రదర్శించాయని కొనియాడారు. దళితుల పక్షాల తాము నిలబడ్డామని, ఆదివాసీ గూడాల్లో చైతన్యం కలిగించే ప్రయత్నం చేశామన్నారు రేవంత్ రెడ్డి.