కోకాపేట భూములపై సీబీఐకి ఫిర్యాదు చేసిన ఎంపీ రేవంత్ రెడ్డి... !
కోకాపేట భూములపై సీబీఐకి ఫిర్యాదు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ తనకు కావాల్సిన వారికి అత్యంత చౌకగా ప్రభుత్వ భూములు కట్టబెట్టారని ఆరోపిస్తున్న రేవంత్‌రెడ్డి..;
కోకాపేట భూములపై సీబీఐకి ఫిర్యాదు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ తనకు కావాల్సిన వారికి అత్యంత చౌకగా ప్రభుత్వ భూములు కట్టబెట్టారని ఆరోపిస్తున్న రేవంత్‌రెడ్డి.. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలంటూ సీబీఐ డైరెక్టర్‌ను కోరారు. కోకాపేట, ఖానామెట్ భూముల అమ్మకంలో రాష్ట్ర ఖజానాకు 1500 కోట్ల రూపాయల నష్టం తెచ్చారని సీబీఐ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అవినీతి సొమ్ముతో నేతలను కొంటున్నారంటూ సీఎం కేసీఆర్‌పై రాతపూర్వక ఫిర్యాదు చేశారు. సీఎస్ సోమేశ్ కుమార్, జయేశ్‌రంజన్‌పైనా కంప్లైంట్ ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి.