Telangana: హైకోర్టు ఇన్ ఛార్జ్ చీఫ్ జస్టిస్‌గా ఎం.ఎస్ రామచంద్రరావు
తెలంగాణ హైకోర్టు ఇన్‌చార్జ్ చీఫ్ జస్టిస్‌గా ఎంఎస్ రామచంద్రరావు నియమితులయ్యారు.
MS Rama Chandra rao: తెలంగాణ హైకోర్టు ఇన్‌చార్జ్ చీఫ్ జస్టిస్‌గా ఎంఎస్ రామచంద్రరావు నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జస్టిస్ హిమకోహ్లీ... సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియామకమైన నేపథ్యంలో... ఎం.ఎస్ రామచంద్రరావుకు ఇన్‌చార్జ్ చీఫ్ జస్టిస్ బాధ్యతలు అప్పగించారు. హైకోర్టులో అత్యంత సీనియర్ కావడంతో ఇన్‌చార్జ్ చీఫ్ జస్టిస్‌గా ఎం.ఎస్ రామచంద్రరావు నియమితులయ్యారు.