Musi River : యాదాద్రిలో ఉగ్రరూపం దాల్చుతున్న మూసి..
Musi River : యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది.
Musi River : యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. పైనుంచి వస్తున్న వరదతో భూదాన్ పోచంపల్లి మండలం జూలూర్ వద్ద ఉధృతంగా కొనసాగుతోంది. అలాగే బీబీనగర్ మండలం రుద్రవెళ్లి లోలెవల్ బ్రిడ్జి పైనుంచి మూసీ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది.
దీంతో బీబీనగర్-భూదాన్ పోచంపల్లి మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మూసీ పరివాహక ప్రాంతాల్లోని బ్రిడ్జీలు, వంతెనల వద్ద ముందు జాగ్రత్తగా పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.