మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం

Update: 2021-01-04 09:20 GMT

మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. వరంగల్- హైదరాబాద్ జాతీయరహదారిపై హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ఆయన కారు బైక్ ను ఢీ కొట్టి పక్కనే ఉన్న గోతిలో పడింది. కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డాడు. అయితే డ్రైవర్ తో పాటు మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. వారిని మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.




Tags:    

Similar News