TG : ఏఐసీసీ ఇన్చార్జితో నీలం మధు భేటీ

Update: 2025-03-01 11:30 GMT

పార్టీ కోసం కష్టపడిన ప్రతిఒకరికీ కాంగ్రెస్ లో గుర్తింపు ఉంటుందని, అందుకు ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ నియామకం నిదర్శనమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెండ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఏఐసీసీ ఇన్చార్జిగా నియమితులై తొలిసారిగా వచ్చిన ఆమెను నీలం మధు మర్యాద పూర్వకంగా కలిశారు. శుక్రవారం గాంధీ భవన్లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆమెకు మధు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతోందన్నారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లో యువతకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందన్నారు.

Tags:    

Similar News