33 ఏండ్ల తర్వాత కేంద్ర ప్ర భుత్వం దేశంలో నూతన విద్యా విధానాన్ని తీసుకువచ్చిందని, 2030 నాటికి దేశంలోని ప్రతి ఒక్కరికి విద్యను అందించడమే లక్ష్యమ ని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్రెడ్డి అన్నారు. ప్రైమరీ ఎడ్యుకేషన్కు ప్రయారిటీ ఇచ్చి, మాతృభాషను రక్షించేలా విద్యావిధా నంలో సమూల మార్పులు తీసుకువచ్చింద న్నారు. ఇవాళ విద్యానగర్ జామియా ఉస్మా నియా గవర్నమెంట్ హైస్కూల్లో ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో టాయిలెట్ క్లీనింగ్ మిషన్స్, ఫర్నిచర్ను ఆయన అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హై స్కూల్స్ లో కూడా వివిధ రకాల ఒకేషనల్ కోర్సులను తీసుకువచ్చేలా నూతన విద్యావి ధానాన్ని అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు తోడ్పాటు అందించాలన్నారు. ' 8న జరిగే దిశ మీటింగ్ లో హైదరాబాద్ నగర అభి వృద్ధి, ప్రభుత్వ పాఠశాలలపై పురోగతిపై అధికారులతో చర్చిస్తా. రాష్ట్రంలో విద్యావ్య వస్థను మెరుగుపర్చుకోవాలి. దేశంలో అధి కశాతం విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్ లోనే చదువుతున్నారు. ప్రభుత్వ స్కూల్స్ దేశానికి పట్టుగొమ్మలు. రానున్న రోజుల్లో మరింత పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సర్కార్ బడుల అభివృద్ధికి సమాజ మంతా బాధ్యత తీసుకోవాలి. గవర్నమెంట్ స్కూల్స్లోనే నిష్ణాతులైన టీచర్లు ఉన్నారు. ప్రైవేటు బడులకు ధీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు పెరగాలి. నేను ఎమ్మెల్యేగా ఉన్న ప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ను చాలా బాగా డెవలప్డ్చేశాం. ప్రభుత్వ స్కూళ్లలో మంచి రిజల్ట్ వచ్చేలా రాజకీయ నాయకులు, విద్యా ర్థుల పేరెంట్స్, టీచర్లు, ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి' అని కిషన్ రెడ్డి అన్నారు.