New Food Security Cards : కొత్త ఫుడ్ సెక్యూరిటీ కార్డులు వస్తున్నాయ్!

Update: 2024-05-23 07:29 GMT

ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డు లేదా ఆహార భద్రతా కార్డుల రూపం త్వరలో మారనుంది. వీటి స్థానంలో కొత్త కార్డులు జారీ చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ ముగియగానే కొత్త రేషన్ కార్డులను జారీ ప్రారంభం కానున్నట్లు సమాచారం.

ఆరోగ్య శ్రీ కార్డులతో గతంలో రూ.5 లక్షలు చికిత్స పరిమితి ఉండగా.. కాంగ్రెస్ సర్కార్ ఆ పరిమితిని రూ.10 లక్షలకు పెంచింది. ఈ క్రమంలో పాత ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో కూడా కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వాలని కూడా రాష్ట్ర సర్కారు నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో 89,98,546 రేషన్ కార్డులు కార్డులున్నాయి.

కొత్త రేషన్ కార్డు.. రైతుబంధు లాంటి పాక్ బుక్ సైజ్ లో ఇచ్చే చాన్సుంది.

Tags:    

Similar News