New Ration Card : అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ
కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న పేద, సామాన్య కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త రేషన్ కార్డులకు అక్టోబరు నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Uttam Kumar Reddy ) వెల్లడించారు. రేషన్ కార్డుల జారీపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం మంత్రి ఉత్తమ్ అధ్యక్షతన సోమవారం జలసౌధలో భేటీ అయింది.
రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల సంఖ్య, కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల పంపిణీ, ఇతర మార్గద ర్శకాలపై విస్తృతంగా చర్చించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు జారీపై విధి విధా నాలు, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, నిబంధనలు, ఏ విధంగా సాఫీగా ముందుకు వెళ్లాలన్న అంశాలపై తాము చర్చించామని మంత్రి తెలిపారు.