Secunderabad-Goa Train : సికింద్రాబాద్ నుంచి గోవాకు కొత్త రైలు

Update: 2024-10-04 14:30 GMT

గోవాకు వెళ్లే పర్యాటకుల కోసం కొత్త రైలు ఈ నెల 6 నుంచి అందుబాటులోకి రానుంది. రెగ్యులర్ సర్వీసులు ఈ నెల 9న సికింద్రాబాద్ నుంచి, 10న వాస్కోడిగామా నుంచి ప్రారంభమవుతాయి. సికింద్రాబాద్-వాస్కోడిగామా(17039) రైలు బుధ, శుక్రవారాల్లో, వాస్కోడిగామా-సికింద్రాబాద్(17040) రైలు గురు, శనివారాల్లో బయలుదేరుతాయి. ప్రస్తుతం మంగళ, బుధ, శుక్ర, ఆదివారాల్లో రెగ్యులర్ సర్వీస్(17603) నడుస్తోన్న విషయం తెలిసిందే.

ఈ ట్రైన్లలో ఫస్ట్ ఏసీ, 2ఏసీ, 3 ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి. ఇక ఈ ట్రైన్స్ టిక్కెట్ల బుకింగ్ అక్టోబర్ 4 నుంచి మొదలు కానుంది. అక్టోబర్ 6వ తేదీ ఉదయం 11.45 గంటలకు ట్రైన్ సికింద్రాబాద్ నుంచి మొదలై తర్వాత రోజు ఉదయం 7.20 గంటలకు చేరుతుంది. అయితే ప్రతి ఏటా 80 లక్షల మందికిపైగా గోవాను సందర్శిస్తుండగా వారిలో తెలుగువారే 20 శాతం ఉండటం విశేషం. ట్రైన్ సౌకర్యం తక్కువగా ఉన్న నేపథ్యంలో గతంలో అనేక మంది తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రైవేటు వాహనాలు, ఫ్లైట్లబం ఆశ్రయించి గోవాకు వెళ్లేవారు. ఇప్పుడు రెండు ట్రైన్లు అందుబాటులోకి వస్తే గోవాకు వెళ్లే వారి సంఖ్య మరింత పెరగనుంది.

Tags:    

Similar News