New Year Celebrations: తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలపై హైకోర్టు క్లారిటీ.. ఆంక్షలు తప్పవు!
New Year Celebrations: నూతన సంవత్సర వేడుకల విషయంపై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్ని తప్పుపడుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.;
New Year Celebrations: తెలంగాణలో నూతన సంవత్సర వేడుకల విషయంపై ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్ని తప్పుపడుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్ట్ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చిందని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఇతర రాష్ట్రల మాదిరిగా ఆంక్షలు పెట్టాలని హైకోర్ట్ ఆదేశించినా.. సర్కారు పట్టించుకోలేదని పిటిషనర్ అన్నారు.
పాండమిక్, ఎపిడమిక్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తుందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఓమిక్రాన్‌ను కట్టడిపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వమే ఇష్టారీతిన వేడుకలను అనుమతి ఇవ్వడం సరికాదన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 62 ఒమిక్రన్ కేసులు నమోదయ్యాయని వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకుని న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని కోరారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు రేపు వాదనలు వింటామని స్పష్టం చేసింది.