Telangana : న్యూ ఇయర్.. మందుబాబులకు శుభవార్త

Update: 2024-12-28 17:52 GMT

న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మందుబాబులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 31న వైన్ షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్లు, రెస్టారెంట్లు, ఈవెంట్ల పర్మిషన్లను ఒంటి గంట వరకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ఈ వేడుకల్లో డ్రగ్స్ వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ముఖ్యంగా GHMC పరిధిలోని ఈవెంట్లు, పార్టీలపై నిఘా ఉంచాలని సూచించింది. న్యూ ఇయర్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జ‌రిగే ఈవెంట్ల‌ను రాత్రి 1 గంట వ‌ర‌కే ప‌రిమితం చేసింది ప్ర‌భుత్వం. అదే స‌మ‌యంలో డ్ర‌గ్స్ పై ఉక్క‌పాదం మోపుతోంది. ఈవెంట్స్‌లో డ్ర‌గ్స్ వినియోగించ‌కుండా ఆంక్ష‌లు విధించింది. ఎవ‌రైనా డ్ర‌గ్స్ అమ్మినా, కొనుగోలు చేసినా, త‌మ ద‌గ్గ‌ర ఉంచుకున్నా క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని హెచ్చ‌రించింది. మ‌త్తు ప‌దార్థాల‌కు దూరంగా ఉండాల‌ని సూచించింది. ఇక గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (జీహెచ్ంఎసీ) ప‌రిధిలో జ‌రిగే ఈవెంట్స్‌, పార్టీల‌పై పోలీసులు ఓ న‌జ‌ర్ ఉంచాల‌ని ఆదేశించింది.

Tags:    

Similar News