కేంద్ర హోంశాఖ ఆదేశాలతో రాష్ట్రంలో ఉన్న పాకిస్థానీయుల వివరాలు ఆరా తీస్తున్నారు తెలంగాణ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు. ఇప్పటివరకు స్పెషల్ బ్రాంచ్ లో 208 మంది పాకిస్తానీయులు రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. వీరిలో లాంగ్ టర్మ్ వీసా ఉన్నవాళ్లు 156 మంది కాగా.. షార్ట్ టర్మ్ వీసా కలిగిన వారు 13 మంది. వారంలోపు దేశం విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశించడంతో.. వాళ్లందరిని పంపించే పనిలో ఉన్నారు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు.