Ramagundam NTPC : రామగుండం ఎన్టీపీసీ వద్ద తీవ్ర ఉద్రిక్తత..
Ramagundam NTPC : రామగుండం NTPC లేబర్ గేటు ముందు కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది.
Ramagundam NTPC : రామగుండం NTPC లేబర్ గేటు ముందు కాంట్రాక్ట్ కార్మికుల ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. వేతన సవరణ అమలు చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు కార్మికులు. ఐతే కార్మికులను అదుపు చేసే క్రమంలో CISF జవాన్లు లాఠీ ఛార్జ్ జరిపారు. దీంతో కొద్దిసేపు టెన్షన్ వాతావరణం ఏర్పడింది. జవాన్లకు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. జవాన్లపైకి కార్మికులు రాళ్లు రువ్వారు. ఈ ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి.
నాలుగేళ్లుగా యాజమాన్యం అగ్రిమెంట్ చేయట్లేదని ఆరోపించారు కార్మికులు. తమపై దాడి చేసిన జవాన్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు కార్మిక సంఘం నేతలు. NTPC యాజమాన్యం దాడులకు పాల్పడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. శాంతియుత వాతావరణంలో సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.