Omicron cases in Telangana: తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు.. అధికారుల అప్రమత్తం..

Omicron cases in Telangana: తెలంగాణలో ప్రవేశించిన ఒమిక్రాన్‌ వేరియంట్‌.;

Update: 2021-12-15 06:26 GMT
Omicron cases in Telangana:  తెలంగాణలో ప్రవేశించిన ఒమిక్రాన్‌ వేరియంట్‌
  • విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్‌
  • కెన్యా నుంచి వచ్చిన యువతికి..
  • సోమాలియా నుంచి వచ్చిన మరొకరికి ఒమిక్రాన్‌ నిర్ధారణ
  • అధికారులను అప్రమత్తం చేసిన తెలంగాణ ప్రభుత్వం
  • సోమాజిగూడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స
  • తెల్లవారుజామున ఆస్పత్రి నుంచి పారిపోయిన ఒమిక్రాన్‌ బాధితులు
  • టోలీచౌకీ, మెహదీపట్నంలో యువతి అడ్రస్‌ గుర్తింపు
  • తెలంగాణలో 3 ఒమిక్రాన్‌ కేసులు వచ్చాయి : డీహెచ్‌
  • కోల్‌కతాకు చెందిన మరో బాలుడికి ఒమిక్రాన్‌ : డీహెచ్‌
  • ఒమిక్రాన్‌ వచ్చిన బాలుడు కోల్‌కతా వెళ్లిపోయాడు: డీహెచ్‌
  • ఒమిక్రాన్ బాధితులకు టిమ్స్‌ గచ్చిబౌలిలో చికిత్స అందిస్తున్నాం : డీహెచ్‌

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న ఒమిక్రాన్‌ వేరియంట్‌... ఇప్పుడు తెలంగాణలోనూ ప్రవేశించింది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి ఈ వేరియంట్‌ నిర్ధారణ అయ్యింది. కెన్యా నుంచి వచ్చి ఓ యువతికి.. అలాగే సోమాలియా నుంచి వచ్చిన మరొకరికి ఒమిక్రాన్‌ సోకినట్లు గుర్తించారు. అయితే సోమాజిగూడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈ ఇద్దరు బాధితులు.. తెల్లవారుజామున అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో వీళ్ల కోసం జల్లెడ పట్టిన అధికారులు.. కెన్యా నుంచి వచ్చిన యువతి టోలీచౌకీ, మెహదీపట్నంలో ఉన్నట్లు గుర్తించారు. ఆమెకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నట్లు డీహెచ్‌ తెలిపారు.

Tags:    

Similar News