Osmania Hospital : వర్షం పడినప్పుడల్లా అవే సమస్యలు.. తృటిలో తప్పిన ప్రమాదం..
Osmania Hospital : హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో ఫాల్ సీలింగ్ ఊడి పడింది.
Osmania Hospital : హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో ఫాల్ సీలింగ్ ఊడి పడింది. దీంతో రోగులు, సిబ్బంది భయబ్రాంతులకు గురవుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఓపీ బ్లాక్‌లో ఫాల్ సీలింగ్ కింద పడింది. మరమ్మతులు చేసి రెండు నెలలు కూడా కాలేదని.. నాణ్యతా లోపం బయటపడిందన్న విమర్శలు వస్తున్నాయి.
ఆస్పత్రిలో రెండు నెలల క్రితం ఓపీ బిల్డింగ్‌లో గ్రౌండ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్‌లో మరమ్మతులు చేశారుఫాల్ సీలింగ్ కింద పడ్డ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.వర్షాకాలం వచ్చిందంటే ఉస్మానియా ఆస్పత్రిలో ఉన్న సిబ్బందితో పాటు రోగులు భయాందోళనలకు గురౌతున్నారు. ఇప్పటికి ఎన్నిసార్లు మరమ్మతులు చేసినా భారీ వర్షం కురిస్తే అవే పాత ఇబ్బందులు పునరావృతమవుతూనే ఉన్నాయి.