తెలంగాణలో పాగల్ పాలన నడుస్తోందని.. జనం తిరగబడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీలో అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారుని ఆరోపించారు. తెలంగాణలో ఆర్‌ఆర్ ట్యాక్స్ నడుస్తోందన్నారు. 8వేల 888 కోట్ల విలువైన టెండర్లపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అడ్రస్, అర్హత లేని కంపెనీకి టెండర్లు ఇచ్చారని మండిపడ్డారు. కేంద్రం స్కీమ్‌లో అవినీతి జరిగితే మోడీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు కేటీఆర్. డబ్బుల మూటలు రాష్ట్ర బోర్డర్ దాటుతున్నాయని అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు కేటీఆర్.