Love Marriage : ప్రేమ పెళ్లి చేసుకున్నాడని యువకుడిపై అమ్మాయి పేరెంట్స్ దాడి
కూతురును ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై యువతి పేరెంట్స్ దాడి చేశారు. ఈ ఘటన హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ పరిధిలో జరిగింది. ఏడాది క్రితం ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు ఓ జంట. యువతి మైనర్ కావడంతో.. పేరెంట్స్ పోలీసులు ఫిర్యాదు చేసారు. దీంతో.. యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. జైలు శిక్ష అనుభవించి.. బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత.. యువకుడిపై దాడి జరిగింది.
జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చినప్పటినుంచీ యువతికి దూరంగా ఉంటున్నాడు యువకుడు. మనకు కొడుకు పుట్టాడనీ.... చూడటానికి అయినా రమ్మని యువతితో బలవంతంగా ఫోన్ చేయించారు యువతి పేరెంట్స్. యువతి మాటలు నమ్మి ఇంటికి వెళ్లాడు అబ్దుల్ సాహెల్. దీంతో.. సాహిల్ ను బంధించి దాడి చేశారు యువతి కుటుంబ సభ్యులు.
ఓ గదిలోకి వెళ్ళి తలదాచుకున్నాడు యువకుడు. తనపై దాడి చేస్తున్నారనీ.. కాపాడండి అంటూ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియోలో పెట్టాడు. పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో.. యువకుడిని పోలీసులు కాపాడారు. దాడిచేసిన వారిపై కేసు పెట్టారు.