టీటీఐపై దాడికి పాల్పడిన ప్రయాణికురాలిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. గురువారం గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ రైలు సికింద్రాబాద్-నుంచి వెళ్తుండగా.. చర్లపల్లి రైల్వేస్టేషన్లో టీటీఐ హని చెకింగ్చేస్తుంది. కూకట్పల్లికి చెందిన ప్రయాణికురాలు కేదారి సత్యవాణి(35)ని టికెట్ చూపించాలని టీటీఐ అడిగారు. దీంతో టీటీఐతో సత్యవాణి గొడవపడి తిడుతూ.. ఆమె చంపపై కొట్టడడమే కాకుండా చేతిని గట్టిగా లాగడంతో కుడి భుజం డిస్ లొకేట్అయింది. దీంతో తీవ్రనొప్పితో టీటీఐ హని భువనగిరి రైల్వే స్టేషన్లో దిగి ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంది. అనంతరం సిటీకి వచ్చి మెట్టుగూడలోని రైల్వే ఆస్పత్రిలో అడ్మిట్అయింది. బాధితురాలు రైల్వే పోలీసులకు కంప్లయింట్ చేయగా.. ప్రయాణికురాలు సత్యవాణిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నిందితురాలిని కఠినంగా శిక్షించాలని మజ్దూర్ యూనియన్ డివిజనల్ సెక్రటరీ రవీందర్ డిమాండ్ చేశారు. టీటీఐ హనీని రైల్వే హాస్పిటల్ లో ఆయనతో పాటు జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మురళీధర్, స్వామి, నాగలక్ష్మి పరామర్శించారు.