TG : మండలి చీఫ్ విప్‌గా పట్నం మహేందర్ రెడ్డి

Update: 2024-10-04 08:45 GMT

తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ గా మాజీ మంత్రి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపికచేశారు. ఈ మేరకు అయన ఉత్తర్వులు అందు కున్నారు. చీఫ్ విప్ గా నియమితులైన మహేందర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, కాలే యాదయ్య, మనోహర్ రెడ్డి, మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి, రోహిణ్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేతలు వక్రేష్ యాదవ్, పరమేశ్వర్ రెడ్డి,కొలను హనుమంత్ రెడ్డి తదితరులు సీఎంతో కలిసిన వారిలో ఉన్నారు. చట్టసభల్లో ఎంతో అనుభవం ఉన్న పట్నం మహేందర్ రెడ్డి చీప్ విప్ గా ఎంపిక కావడం పట్ల పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

Tags:    

Similar News