మంత్రిగా పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం
రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించిన గవర్నర్ తమిళిసై;
ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో మహేందర్‌రెడ్డితో గవర్నర్ తమిళిసై ప్రమాణ చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, మంత్రులు హాజరయ్యారు.
ఇక.. ఈటల రాజేందర్‌ను తప్పించిన తర్వాత ఖాళీగా ఉన్న బెర్త్‌ను మహేందర్‌రెడ్డితో భర్తీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన కీలక నేతగా ఉన్నారు పట్నం మహేందర్‌రెడ్డి. 1994 నుండి తాండూరు అసెంబ్లీ స్థానం నుంచి మహేందర్‌రెడ్డి విజయం సాధిస్తున్నారు. 2014 ఎన్నికల ముందు పట్నం బీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పుడు విజయం సాధించారు. రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో మరోసారి తాండూరు నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్ధిగా పోటీ చేశారు. కానీ కాంగ్రెస్ అభ్యర్ధి రోహిత్‌రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత పట్నంకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ సీటు ఇచ్చింది. కాగా.. తాజాగా తాండూరు బీఆర్‌ఎస్ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి కేటాయించారు. టికెట్ కోసం ప్రయత్నించిన పట్నం మహేందర్‌రెడ్డిని బుజ్జగించి కేబినెట్‌లోకి తీసుకుంది.