తెలంగాణ పీసీసీ చీఫ్ ఎవరనే చర్చ జరుగుతోంది. ఆశావహులు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న జగ్గారెడ్డి ఢిల్లీలోనే మకాం వేసి తనవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సీనియర్ నాయకుడిగా, పార్టీ విధేయుడిగా జగ్గారెడ్డికి రాహుల్గాంధీ వద్ద మంచి పేరుంది. మాజీ ఎంపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ అవకాశ మివ్వాలంటూ సీఎం రేవంత్ రెడ్డితోసహా ఏఐసీసీ పెద్దల తోనూ మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఏఐసీసీ కార్యదర్శిగా, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ పీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నట్ల తెలుస్తోంది. కొత్త రథసారధి కోసం దాదాపు 12 మంది ప్రయత్నాలు చేసుకుంటున్నా, సామాజిక సమతుల్యత పాటించి పార్టీ అధిష్టానం ముందుకెళ్లాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. సీఎంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ ఉండడంతో పీసీస్ అధ్యక్షుడిగా ఆ సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం దాదాపు లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
రెడ్డియేతర సామాజిక వర్గాలకు పీసీసీ అధ్యక్ష పదవి దక్కే అవకాశం ఉందని. స్పష్టమవుతోంది. ఇప్పటికే పీసీసీ అధ్యక్ష పదవి గడువు ముగియడంతో అంతలోపే ఆ ప్రక్రియ పూర్తి చేయాలని ఏఐసీసీ యోచిస్తున్నట్లు సమాచారం. పీసీసీ సంస్థాగత వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగు తున్న మహేశ్ కుమార్ గౌడ్ పార్టీని పూర్తిస్థాయిలో నడుపుతున్నారు. ఆయన్ను నియమిస్తే ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని ముందుకెళ్తారన్న భావన పార్టీ పెద్దల్లో వ్యక్తమవుతున్నట్టు సమాచారం. మాజీ ఎంపీ మధుయాష్కీ విషయంలో ఏఐసీసీ సానుకూలంగా ఉన్నా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు ఎల్బీ నగర్ సీటిచ్చినా గెలవలేక పోయారన్న అంశాన్ని పార్టీ హైకమాండ్ ప్రస్తావిస్తున్నట్టు చెబుతున్నారు. మహేష్ గౌడ్,, మధుయాస్కీలలో ఒకరికి పీసీసీ అధ్యక్ష బాధ్యతలను ఇచ్చే చాన్స్ కనిపిస్తోంది. ఇవాళ ఈ విషయంపై స్పష్టత వచ్చే చాన్సుంది.