Hyderabad : చేయని తప్పుకు నిమ్స్ ఉద్యోగిని చితకబాదిన పోలీసులు

Update: 2024-12-28 09:30 GMT

హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. చేయని తప్పుకి ఆసుపత్రి కాంట్రాక్ట్ కార్మికున్ని పంజాగుట్ట పోలీసులు చితకబాదారు. ఎమ్మారై స్కానింగ్ కోసం వచ్చిన పేషెంట్ బంగారు గొలుసు పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పేషెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కాంట్రాక్టు కార్మికుల్ని గొలుసు గురించి ప్రశ్నించారు. తాను తీసుకోలేదని చెప్పినా వినకుండా విచక్షణారహితంగా చేయి చేసుకున్నారు. చివరికీ ఆ గొలుసు పేషంట్ ఇన్నర్ పాకెట్లో దొరికింది. ఎలాంటి విచారణ చేయకుండా పోలీసులు ఈ విధంగా కార్మికుడిని కొట్టడాన్ని ఖండిస్తూ.. కార్మిక సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. కనీసం కాంట్రాక్టర్‌, నిమ్స్ యాజమాన్యానికి కూడా సమాచారం ఇవ్వకుండా ఎమ్మారై విభాగం పోలీసులకు అప్పగించిందని ఆరోపించారు. ప్రస్తుతం ఆ కార్మికుడు నిమ్స్ ఎమర్జెన్సీలో చికిత్స పొందుతున్నాడు. 

Tags:    

Similar News