ఉప్పల్ భగాయత్లో ఓ ప్రేమజంటను వేధి చిన కేసులో ఉప్పల్ సీఐపై బదిలీ వేటు పడింది. ప్రేమజంటను వేధించిన కేసులో నిందితులపై వీటి కేసు నమోదు చేసి డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలపై పోలీసు ఉన్నాధికారులు విచారణ చేపట్టారు. విచారణలో పోలీసు నిందితులకు కొమ్ము కాసినట్లు తేలడంతో ఉప్పల్ ఎస్ఐ శంకర్ ను డీసీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఈ కేసులో నిర్లక్ష్యం వహించిన ఉప్పల సీఐ ఎలక్షన్ రెడ్డిపై బదిలీ వేటు వేయడంతో పాటు సీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు.
ఉప్పల్ బగాయత్లో ఓ జంట కొందరు బెదరించి మూడు లక్షల రూపాయలు వసూలు చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. దీంతో బాధితులు తమకు జరిగిన మోసంపై పోలీసులను సంప్రదించింది. తమను బెదిరించి కొందరు వ్యక్తులు డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాల్సిన ఎస్ఐ చోరీ చేసిన వ్యక్తులకు కొమ్ముకాశాడు. పోకిరీలతో చేతులు కలిపిన ఎస్ఐ, కాంప్రమైజ్ కావాలని ఫిర్యాదు దారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో తమకు న్యాయం జరగడం లేదంటూ ఆ జంట ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై వారు విచారణకు ఆదేశిచారు. విచారించిన పోలీసు ఉన్నతాధికారులు ఈ కేసులో ఐదుగురి నిందితులను అరెస్ట్ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ శంకర్, సీఐ ఎలక్షన్రెడ్డిలపై బదిలీ వేటు వేశారు.