హోలీ పండుగ సందర్భంగా మూడు కమిషనరేట్ పరిధిలో పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఈనెల 14వ తేదీన ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ 6 గంటల వరకు ఆంక్షలు అమలు చేయనున్నట్లు తెలిపారు. రోడ్డు మీద వెళ్లేవారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు ఉంటాయని, అలాగే రహదారులపై గుంపులుగా ర్యాలీలు నిర్వహించొద్దని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హోలీ రంగులతో ఇబ్బందిపడే వారు ఇంట్లోనే ఉండాలని సూచించారు. ఒకవైపు రంజాన్ మాసం మరోవైపు హోలీ పండుగ శుక్రవారం కావడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మూడు కమిషనరేట్ పరిధిలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు ఆంక్షలు విధించినట్లు తెలిపారు.