తెలంగాణలో నీటి వాటాలపై ఎవరి లెక్కలు వారే చెబుతున్నారు. తెలంగాణలో ఇప్పుడు ఎవరి వాదనలు వారే చెబుతూ రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం చేపట్టిన నల్లమల సాగర్ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అటు కాంగ్రెస్ మాత్రం కెసిఆర్ హయాంలో తీసుకున్న నిర్ణయాల వల్లే తెలంగాణకు అన్యాయం జరిగిందని చెబుతోంది. ఇదే విషయం మీద నేడు రెండు పార్టీలు వేరువేరుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నాయి. అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. దానికి బదులుగా బీఆర్ఎస్ పార్టీ కూడా తెలంగాణ భవన్ లో ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తోంది. అయితే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లలో ఎవరి వాదనలు వారివే అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. అంతే గానీ ఇద్దరి లెక్కలకు అసలు పొంతనే లేదు. కాంగ్రెస్ చెబుతోంది ఏంటంటే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే తెలంగాణకు 299 టీఎంసీలు చాలు అని ఒప్పుకుని వచ్చినట్టు చెబుతోంది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే నీటి దోపిడీని అరికట్టాం అని కాంగ్రెస్ అంటోంది. కానీ బీఆర్ ఎస్ మాత్రం ఏపీకి మేలు చేయడానికే రేవంత్ రెడ్డి నల్లమల సాగర్ ప్రాజెక్టును అడ్డుకోవట్లేదని చెబుతోంది. తమ ప్రభుత్వంలో చేసిన కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ ప్రజెంటేషన్లు ఇచ్చుకుంటున్నారు. ఇలా ఎవరికి వారే తమకు లాభం చేకూరేలా ప్రకటనలు చేస్తున్నారు. దీంతో ఈ నీటి వాటాలపై ప్రజల్లో గందరగోళం పెరుగుతోంది. వాస్తవానికి ట్రిబ్యునల్ ముందు చెప్పిన వాదనలను కాంగ్రెస్ అసెంబ్లీలో కూడా ప్రస్తావించింది. కానీ అసెంబ్లీకి రాకుండా బీఆర్ ఎస్ మరో దారి సెలెక్ట్ చేసుకుంది.
ఇప్పటి వరకు ఉన్న అన్ని ఇష్యూలు పక్కకు పోయి ఈ నీటి వివాదమే ఇప్పుడు మెయిన్ ఇష్యూ అయిపోయింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చుట్టూ ఈ వివాదం పెరుగుతుండటంతో.. దీనిపై సీఎం రేవంత్ కూడా సీరియస్ గానే ఉన్నారంట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ మీద సిట్ విచారణకు ఆదేశించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దాని మీద ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి కేసీఆర్ దీనిపై మళ్లీ ఏమైనా రియాక్ట్ అవుతారా లేదా అన్నది చూడాలి.