Pothuraju Dinesh : పోతరాజు దినేష్‌ మృతి

Update: 2024-05-07 05:28 GMT

లష్కర్‌ శ్రీఉజ్జయినీ మహాకాళి దేవాలయ పోతురాజులలో ఒకరైన దినేష్‌ ఆదివారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు. దినేష్‌ గత ఎనిమిది సంవత్సరాలుగా అమ్మవారి సేవలో పోతరాజుగా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా దినేష్‌కు ఇటీవల పసిరికలు వచ్చినప్పటి నుంచి అనారోగ్యానికి గురయ్యాడు. కొన్ని రోజులుగా ఆరోగ్యం మరింత క్షీణించడంతో అతడిని కుటుంబ సభ్యులు గాంధీ ఆస్పత్రిలో చేర్చారు.

పసిరికలు ముదరడంతో ఆదివారం రాత్రి తుదిశ్వాస వదిలారు. దినేష్‌కు భార్య, ఒక పాప, ఒక బాబు ఉన్నారు. ఆయన పలు సినిమాలు, సీరియల్స్‌లో కూడా నటించారు. దినేష్‌ తల్లిదండ్రులు యాప్రాల్‌ బాలాజీనగర్‌లో ఉంటుండంతో ఆయన కుటుంబ సభ్యులు సోమవారం దినేష్‌ అంత్యక్రియలను బాలాజీనగర్‌లోనే నిర్వహించారు.

Tags:    

Similar News