ఇటీవలే హైదరాబాద్లో పర్యటించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరోసారి తెలంగాణకు రానున్నారు. రెగ్యులర్ షెడ్యూల్లో భాగంగా శీతాకాల విడిది కోసం హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రానున్న నేపథ్యంలో పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను అధి కారులు విడుదల చేశారు. ఈనెల 16 నుంచి 21 వరకు ఆరురోజుల పాటు.. ఆమె ఇక్కడే ఉండనున్నారు. అలాగే ఈనెల 21న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్రపతి వెళ్లనున్నట్లు అధికారులు వెల్లడించారు