మరో మూడు గూడేల్లో కంటైనర్ స్కూళ్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందనే డిమాండ్ ను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి, మామిడి గూడెం, రామకృష్ణాపూర్ గ్రామాల్లో గుత్తికోయి పిల్లలు విద్యాభ్యాసానికి ఆమడ దూరంలో ఉన్నారని ప్రభుత్వానికి రిపోర్టులు అందాయి.
వీరంతా ఛత్తీస్ గఢ్ నుంచి వలస వచ్చి తెలంగాణలో స్థిరపడుతున్నారు. వారు నివసించే గ్రామాలు పూర్తిగా అటవీశాఖ పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతంలో భవనాలను నిర్మించడానికి అటవీశాఖ అనుమతులను నిరాకరించింది. దీంతో పూరిగుడిసెల్లో పాఠశాలలు నిర్వహిస్తున్నారు. అసలే అటవీ ప్రాంతం కావడంతో ఎప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందో తెలియదు. ఆయా గ్రామాల్లో కూడా కంటైనర్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని ఆయా గ్రామాలకు చెందిన గుత్తికోయి తెగ వారు కోరుతున్నారు.