నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం సరంపేటలో పత్తి రైతులు ఆందోళన చేపట్టారు. పత్తి కొనుగోలు చేయాలని..రోడ్డుపై బైటాయించారు. కాటన్ మిల్లు ముందు ట్రాక్టర్లతో ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైటాయించడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..అధికారులతో మాట్లాడి రైతుల డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. దీంతో రైతులు నిరసన విరమించారు.