కుల గణనకి దేశంలో రాహుల్ గాంధీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి హీరో లని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ప్రధాని మోడీ నిర్ణయం హర్షణీయమని కానీ క్రెడిట్ మాత్రం రాహుల్ దే అని అన్నారు. కులగణనపై కిషన్ రెడ్డి ఏం మాట్లాడినా ప్రజలు పట్టించుకో రన్నారు. ఇవాళ గాంధీభవన్లో ఆయన మా ట్లాడుతూ.. రాహుల్ గాంధీ కి వచ్చిన ఐడియా మోడీ కి ఎందుకు రాలేదని బీజేపీ నేతలకు నిద్ర పట్టడం లేదన్నారు. రాహుల్ గాంధీకి ముందు చూపునకు కుల గణనే నిదర్శనమన్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు సమస్త కులాల అందరూ ఈ భారత భూమి బిడ్డలే కదా..? కుల గణనలో ఇతర మతాల వారు ఉండరని కిషన్ రెడ్డి కాదు మోదీ చెప్పాలి. కిషన్ రెడ్డి కి ఇష్టం లేదని వదిలేస్తారా? ప్రధాని ఏం చెప్తారో చూసి మాట్లాడదాం. ముస్లింలు భారత దేశ పౌరులు కాదా..? కిషన్ రెడ్డి ఇప్పుడు ఏం అన్నా లాభం లేదు. మీరేం చెప్పినా కుల గణన హీరో రాహుల్ గాంధీ ' అని జగ్గారెడ్డి అన్నారు.