తెలంగాణ రాష్ట్రానికి మరో రెండు రోజులు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. తెలంగాణలో మరో రెండు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
నేడు భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది.
రేపు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భువనగిరి, రంగారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. జూన్ ఆరో తేదీనుంచి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు పూర్తిగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.