నగరంలో నాలుగు రోజులు.. భారీ నుంచి అతి భారీ వర్షాలు
రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో ప్రధాన మార్గాల్లో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి.;
తెలంగాణలో రానున్న 3-4 రోజుల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈనెల 6న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని.. ఆ తర్వాత అది వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది.
గురువారం రాత్రి నగరంలో కురిసిన భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో ప్రధాన మార్గాల్లో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. మేడ్చల్, మల్కాజ్‌గిరి, బాలానగర్‌లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నగరంలోని మిగతా ప్రాంతాల్లో 5 నుంచి 4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.