Heavy Rains : హైదరాబాద్ లో వర్షం.. తెలంగాణలో ఐదు రోజుల పాటు వర్షాలు

Update: 2024-10-14 14:30 GMT

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈ సాయంత్రం వర్షం దంచికొట్టింది. సికింద్రాబాద్, కూకట్ పల్లి,బంజారాహిల్స్, లక్డీకాపూల్, మేడ్చల్ ఏరియాల్లో మోస్తరు వర్షం కురిసింది. తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అవకాశం ఉందని పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. వాయువ్య దిశగా కదులుతూ మరింత బలంగా మారుతుందని తెలిపింది.

తెలంగాణలో రాగల ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు అవకాశం ఉందని పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. వాయువ్య దిశగా కదులుతూ మరింత బలంగా మారుతుందని పేర్కొంది. మంగళవారం ఉదయం వరకు మధ్యబంగాళాఖాతం వరకు చేరుతుందని చెప్పింది. ఆ తర్వాత రెండురోజుల్లో మరింత ముందుకు కదులుతూ పశ్చిమ వాయువ దశగా కదులుతూ తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఏపీ తీరాలకు చేరే అవకాశం ఉందని వెల్లడించింది.

Tags:    

Similar News