తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట, ములుగు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం ఖమ్మం, నల్గొండ, వరంగల్ ప్రాంతాల్లో వర్షాలు దంచికొట్టాయి. హైదరాబాద్ నగరంలోనూ చిరుజల్లులు కురిశాయి. అటు ఏపీలోని పలు జిల్లాల్లోనూ వరుణుడు కరుణించాడు. హైదరాబాద్ విషయానికొస్తే, డిపార్ట్‌మెంట్ ఎల్లో అలర్ట్‌ను జారీ చేయడమే కాకుండా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన ఈదురు గాలులతో కూడిన జల్లులను కూడా అంచనా వేసింది. ఎల్లో అలర్ట్ రేపటి వరకు ఉన్నప్పటికీ, నగరంలో ఆగస్టు 10 వరకు వర్షపాతం కొనసాగే అవకాశం ఉంది.