TG : కేసీఆర్​కు రాజకీయ భిక్ష పెట్టిందే రాజీవ్ గాంధీ : వీహెచ్

Update: 2024-08-20 14:30 GMT

కేటీఆర్ విదేశాల్లో ఉన్నత చదువులు చదివినప్పటికీ కనీస జ్ఞానం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే తాము అధికారంలోకి వచ్చాక తొలగిస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలపై సోమవారం ఆయన తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ అధికారంలోకొస్తే కదా ఏదైనా చేయడానికంటూ సెటైర్ వేశారు. కేసీఆర్​కు రాజకీయ భిక్ష పెట్టిందే రాజీవ్ గాంధీ అని చెప్పారు. అలాంటి మహోన్నత వ్యక్తి విగ్రహం సెక్రెటేరియట్ ముందు పెడితే తప్పేంటని ప్రశ్నించారు. మరోసారి రాజీవ్ గాంధీ గురించి తక్కువ చేసి మాట్లాడితే కేటీఆర్‌కే అవమానమన్నారు. తాము కూడా మాట్లాడగలమని కానీ దెబ్బకు దెబ్బ తమ విధానం కాదన్నారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేకపోయిందని విమర్శించారు.

Tags:    

Similar News