తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల!
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 1న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్ పరీక్ష, ఏప్రిల్ 3న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు, ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ ఉంటాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇంటర్ ఒకేషనల్ కోర్సుల పరీక్షలకూ ఇదే షెడ్యూల్ వర్తించనుందని వెల్లడించింది. కాగా పదో తరగతి పరీక్షలు మే 17 నుంచి నిర్వహించే అవకాశం ఉంది. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొంటూనే క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం విద్యాసంస్థలను ఆదేశించింది.